ఆగస్టు నెల కార్యక్రమాలపై జగన్  ఫోకస్

0 16

విజయవాడ ముచ్చట్లు :

 

స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణా చర్యలు, వ్యాక్సినేషన్, గ్రామ, వార్డు సచివాలయాలు, బియ్యంకార్డు, పెన్షన్‌ కార్డు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాల అమలు వంటి కీలక విషయాలపై సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల సమర్ధ మేరుగుపదాలంటే.. వాటిని ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తుండాలని ఆయన అన్నారు. వారానికి రెండు సార్లు కలెక్టర్లు, నాలుగుసార్లు జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్‌ కలెక్టర్లు కూడా వారానికి నాలుగుసార్లు సచివాలయాలను సందర్శించి వాటి పనితీరును పర్యవేక్షించాలన్నారు. తనిఖీలు చేయని అధికారులకు నోటీసులు ఇవ్వాలన్న సీఎం.. అటు జేసీలకు కూడా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.బియ్యంకార్డు, పెన్షన్‌ కార్డు, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి పేర్కొన్న సీఎం.. అవి నిర్దేశించిన సమయంలోగా అర్హులకు అందేలా చూడాలని తెలిపారు. ఆయా పధకాలు అనర్హులకు అందకుండా చూసుకోవాలి. ఇందుకు అనుగుణంగానే అధికారులు స్వయంగా సచివాలయాలను సందర్శించి పర్యవేక్షించాలి. ఏమైనా లోపాలు ఉంటే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. సిబ్బందికి మెమోలు ఇవ్వడమన్నది తనకు కూడా బాధను కలిగిస్తోందని.. వచ్చే స్పందనలోగా పరిస్థితుల్లో మార్పులు రావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.కాగా, ఆగష్టు 10వ తేదీన నేతన్న నేస్తం, ఆగష్టు 16న విద్యాకానుక, రూ. 20 వేలలోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆగష్టు 24న డబ్బు జమ, ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగష్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని.. కలెక్టర్లు ఇందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Pics focus on August events

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page