ఆ ప్రోఫెసర్ల కృషి మరవలేనిది-మంత్రి ఎర్రబెల్లి

0 14

వరంగల్ ముచ్చట్లు :

 

యూనెస్కో గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయం మరింత అభివృద్ది చెందేందుకు ఆస్కారం ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రపంచ పటంలో ములుగు జిల్లాలోని పాలంపేటలో కాకతీయ రాజులు నిర్మించిన కట్టడానికి చోటు దక్కడం వల్ల మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నట్లయిందని ఆయన అన్నారు. చరిత్రక రామప్ప దేవాలయం యూనెస్కో గుర్తింపు పొందడానికి ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు  ఎం. వి పాపారావు,ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, ఆర్కిటేక్చర్ . సూర్యనారాయణ మూర్తిని మంగళవారం నాడు వరంగల్ అర్బన్ జిల్లాలోని రాంపూర్ లో మంత్రి కలిసి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్పకు యునేస్కో గుర్తింపు రావడం వెనుక 11 సంవత్సరాలుగా పాపారావు, పాండురంగారావులు చేసిన కృషి ఎంతో ఉందన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags: The work of those professors is unforgettable — Minister Errabelli

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page