ఇక డీజిల్‌ డోర్‌ డెలివరీ

0 16

ఢిల్లీ ముచ్చట్లు :

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డీజిల్‌ డోర్‌ డెలవరీ స్కీంని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ అమల్లోకి తెచ్చింది. ఢిల్లీకి చెందిన స్టార్టప్‌ సంస్థతో కలిసి సేఫ్‌20 పేరుతో డీజిల్‌ డోర్‌ డెలివరీ చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలో 20 లీటర్ల జెర్రీ క్యాన్లను ఢోర్‌ డెలివరీగా బీపీసీఎల్‌ అందిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న హమ్‌ సఫర్‌ సంస్థతో బీపీసీఎల్‌ టై అప్‌ అయ్యింది. 20 లీటర్ల సామర్థ్యం కల జెర్రీ క్యాన్లలో డీజిల్‌ని డోర్‌ డెలివరీ చేస్తోంది. డోర్‌ డెలివరీ కావాలంటే కనీసం 20 లీటర్లు ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Diesel door delivery

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page