ఈ-క్రాప్ బుకింగ్ తోనే రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపు… ఏవో హేమలత

0 15

మద్దికేర ముచ్చట్లు :

2021 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు సాగు చేసినటువంటి తమ పంటలను తక్షణమే ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని మద్దికేర మండలం వ్యవసాయ అధికారిని హేమలత తెలియజేశారు.మంగళవారం రోజున మద్దికెర మండల పరిధిలో వ్యవసాయాధికారులు చేస్తున్న పంట నమోదు కార్యక్రమాన్ని ఏవో హేమలత పరిశీలించారు.ఈ సందర్భంగా ఏ.ఓ హేమలత మాట్లాడుతూ పంట నమోదు కార్యక్రమం ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ,ఇన్సూరెన్స్ మరియు తదితర ప్రభుత్వ పథకాలు రైతులకు చేరుతాయని ఆమె తెలియజేశారు.కావున రైతులు ఎవరు నిర్లక్ష్యం చేయకుండా వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన చేయించుకోవాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి యోగేంద్ర,ఎంపీఈవో మాధవి,వి.హెచ్.ఏ మౌనిక మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Government schemes applicable to farmers with e-crop booking …
Ayo hemalata

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page