ఎండిన వరి గడ్డి తింటూ రైతుల అర్థనగ్న నిరసన దీక్ష

0 5

తుంగతుర్తి  ముచ్చట్లు :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం, సంగెమ్ ప్రభుత్వ ఐ కే పి సెంటర్లలో తరుగు తీసిన ధాన్యం డబ్బులు చెల్లించనందుకు రైతులకు జరిగిన నష్టాన్ని నిరసిస్తూ  అన్నారం గ్రామములో  రైతులు తన్నీరు వెంకన్న, పూస పెల్లి శ్రీను, గోపగాని వెంకట రామనర్సయ్య, తన్నీరు సోమనరసయ్య లు ఎండిన వరి గడ్డి తింటూ  అర్థ నగ్న నిరసన దీక్షలు చేశారు. అన్నారం, సంగెమ్ ఐ కే పి సెంటర్ల ఉద్యోగులు క్వింటాల్ కు 6 నుండి 10 కిలోలు తరుగు పేరున ధాన్యాన్ని తగ్గించి రైతుల పొట్ట కొట్టారని రైతుల కన్నీటి బాధలు నిర్వాహకులకు తగులుతుందని రైతులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఆర్ డి ఓ కు ఐ కే పి సెంటర్ల దోపిడీని అరికట్టాలని, మాకు తరుగు తీసిన ధాన్యానికి డబ్బులు ఇప్పించాలని కోరుతూ పిర్యాదు ఇచ్చి 1 1/2 నెలలు దాటినా పట్టించుకోవడం లేదని నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని రైతులు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో ఐ కే పి సెంటర్లలో జరిగే అవకతవకలు, రైతులకు జరిగే ఇబ్బందులను  అరికట్టలేని అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలని వారు తీసుకునే లక్షల జీతాలకు న్యాయం చెయ్యాలని  అన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Meaningful protest of farmers eating dried paddy grass

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page