ఎంపి మిథున్ రెడ్డి  అవిరళ కృషి

0 58

రాజంపేట ముచ్చట్లు :

 

రాజంపేట పార్లమెంట్ సభ్యులు   పి. వెంకటమిథున్ రెడ్డి  అవిరళ కృషి, శ్రమ, పట్టుదలతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మదనపల్లి – తిరుపతి  నాలుగు వరసల జాతీయ రహదారి కొరకు  కేంద్ర రహదారులు , ఉపరితల శాఖ మంత్రి   నితిన్ గడ్కారీ తో మాట్లాడి , ఉన్నతాధికారులు తో సమన్వయ పరిచి అనుమతులు మంజూరు చేయించినారు. నిధులు కూడా విడుదలైనాయి. శానిటోరియం, CTM, వాయల్పడు, కలికిరి, పీలేరు వంటి పట్టణాల నందు బైపాస్ లు నిర్మిస్తారు. ఆగష్టు లేదా సెప్టెంబరు నెల లోపల టెండర్లు పిలుస్తారు. రెండు నెలలు లోపల పని కూడా ప్రారంభమవుతుందని ఎంపీ   పీవీ మిధున్ రెడ్డి తెలిపారు. ఈ రహదారి వలన ప్రమాదాలు తగ్గి, తక్కువ ప్రయాణ సమయంలో త్వరగా గమ్యం చేరుకుంటారు , పరిసర గ్రామాల అభివృద్ధి జరుగుతుంది అని ఎంపీ  తెలిపారు.  ఎంతో కృషితో పట్టుదలతో శ్రమించి రహదారి మంజూరు చేయించినందుకు పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి కి పీలేరు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలు  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: MP Mithun Reddy’s tireless work

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page