ఐబీ అధికారి భార్య పేరు మీద యాప్ ఓపెన్ చేసిన శిల్పా శెట్టి భర్త

0 14

ముంబయి ముచ్చట్లు :

రాజ్‌ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్‌ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్‌ షాట్స్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్‌-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్‌ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగించారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇందుకుగాను రాజ్‌ కుంద్రా ఏకంగా ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్‌ ఠాకుర్‌ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. అవార్డులు గెలుచుకున్న షార్ట్‌ ఫిలిమ్స్‌ను ప్రసారం చేసేందుకు యాప్‌ను ఏర్పాటు చేద్దామని యష్‌ ఠాకూర్‌.. సదరు ఐబీ అధికారి వద్ద ప్రతిపాదించాడు. అందుకు అంగీకరించిన ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్‌ యాప్‌ను రిజిస్టర్‌ చేశాడు. అయితే ఆ యాప్‌లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్‌ చేయడంతో అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Husband of Shilpa Shetty who opened the app in the name of IB officer wife

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page