జగన్నాథ గట్టు ఇందిరమ్మ కాలనీలో విద్యుత్, తాగునీరు, రోడ్లు తదితర వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించండి

0 13

అధికారులకు ఆదేశించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

కర్నూలు  ముచ్చట్లు :

- Advertisement -

కర్నూలు రూరల్ మండలం, దిన్నెదేవరపాడు గ్రామపంచాయతీ జగన్నాథ గట్టు ఇందిరమ్మ కాలనీలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్, తాగునీరు, రోడ్లు తదితర వసతులు కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు  సంబంధిత అధికారులకు ఆదేశించారు.మంగళవారం ఉదయం కర్నూలు రూరల్ మండలం, దిన్నెదేవరపాడు గ్రామ పంచాయతీ జగన్నాథ గట్టు లో గతంలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీలోని గృహ నిర్మాణాలను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డా జె.సుధాకర్, జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతు భరోసా) రామ సుందర్‌ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజిలతో కలిసి పరిశీలించారు.అందులో భాగంగా జగన్నాథ గట్టు ఇందిరమ్మ కాలనీలో ఏ ఏ వసతులు ఉన్నాయి, ఇంకా ఏ మౌలిక వసతులు కల్పించాలి వంటి వివరాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకు మునుపు ఇందిరమ్మ కాలనీలో నిర్మించిన గృహంలోకి వెళ్ళి బెడ్ రూమ్, హాలు, కిచెన్ తదితర గదులను స్వయంగా పరిశీలించారు.బోర్లు వేస్తే నీళ్ళు పడతాయా వంటి వివరాలను అధికారులను అడగగా 500 అడుగులలో నీరు పుష్కలంగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే బోర్లు వేసి కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, హౌసింగ్ ఈఈ నాగరాజు, కర్నూలు ఆర్ డి ఓ హరిప్రసాద్, కర్నూలు రూరల్ తహసీల్దార్ వెంకటేష్ నాయక్, హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Provide electricity, drinking water, roads etc. in Jagannath Fort Indiramma Colony on war footing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page