జగిత్యాలలో ఇసుక మాపియా

0 12

కరీంనగర్ ముచ్చట్లు :

 

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావు పేటలో పోలీసులపై ఇసుక మాఫియా దాడికి దిగింది. గోదావరి నదిలో నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టు కునేందుకు పోలీసులు వెళ్లారు. దీంతో మల్లాపూర్ ట్రైనీ ఎస్ఐ వెంకటేష్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, రాజ్ కుమార్, సురేష్ తో వాగు వద్దకు వెళ్లడంతో వారిపై అక్కడ ఇసుక తరలిస్తున్న వారు దాడికి దిగారు.ఇసుక అక్రమ రవాణా దారులు పోలీసులని చూసి బండలు,రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. ఈ దాడిలో రాజ్ కుమార్ , శ్రీను, సురేష్ అనే కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలాన్ని డిఎస్పీ గౌస్ బాబా పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తులు అక్కడ్నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు జేసీబీల సాయంతో అక్కడ ఉన్న ఇసుక ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. దాడికి దిగిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Sand Mafia in Jagits

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page