టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత  ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

0 19

ప్రొద్దుటూరు ముచ్చట్లు :

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పురపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. స్థానిక డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపా నేతలు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నాను విరమించుకొని టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించిన భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చాలాసేపు తోపులాట జరిగింది. అనంతరం అక్కడే బైఠాయించిన భాజపా నేతలను ఆందోళన విరమించాలని డీఎస్పీ కోరారు. వారు ఒప్పుకోకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు స్థానికంగా ఉన్న జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇటీవల భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Tension in Proddatur over opposition to setting up a statue of Tipu Sultan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page