తాగునీటిపై నిర్వహించిన పరీక్షలు

0 14

పత్తికొండ  ముచ్చట్లు :
గ్రామీణ ప్రజలు కొన్నేళ్ల నుంచి సేవిస్తున్న తాగునీటి పై అన్ని రకాల పరీక్షలు నిర్వహించామని పంచాయతీ కార్యదర్శి మునిస్వామి , ఇంజనీరింగ్ అసిస్టెంట్ రవికుమార్  తెలిపారు. సోమవారం మండల పరిధిలోని పుచ్చకాయల మాడ గ్రామం లో ప్రజల విజ్ఞప్తి మేరకు తాగునీటిపై పరీక్షలు చేశామని తెలిపారు. నీళ్లలో పిహెచ్ వాల్యూ క్లోరైడ్, ఆల్కలీనైటీ, కఠినత్వం, నైట్రేట్స్ స్థాయి, ఫ్లోరైడ్ టెస్టు లు చేశామని వివరించారు. గ్రామంలో నీళ్లలో అన్ని సాధారణ స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. వర్షాకాలంలో తాగు నీరు కలుషితం కాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తాగునీరు కలుషితం అయినా కాక పోయినా ప్రతిరోజు తాగు నీరు గోరువెచ్చగా చేసుకుని సేవించాలని చెప్పారు. చిన్న పెద్ద తేడా లేకుండా తాగునీరు ను వేడి చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్నారు. వేడి నీరు తాగితే సులభంగా మల విసర్జన జరుగు తుందని పేర్కొన్నారు. గ్రామస్తులందరూ ముందు జాగ్రత్త కోసం ఇంటి పరిసరాలను, నివాస గ్రామంలో పరిశుభ్రంగా ఉంచు కోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ అసిస్టెంట్ విక్రమ్, విఆర్ఓ సుజిత, అగ్రికల్చర్ సహాయకురాలు ప్రవళిక, ఏఎన్ఎం లావణ్య పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Tests conducted on drinking water

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page