తిరుమలేశునికే మోసం చేసిన బీజేపీ  దేవాలయాల యాత్రలా !   యూత్ కాంగ్రెస్

0 5

కడప ముచ్చట్లు :
కడప కాంగ్రెస్ కార్యాలయములో ప్రెస్ మీట్ లో 2014లో అధికారంలోకి రాక ముందు ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నమ్మించి తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన మాట తప్పిన బిజేపీ దేవాలయాల యాత్ర చేయటం హాస్యంగా వుందని యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పలి పుల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో యేర్పాటుచేసినవిలేఖరులసమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రా ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వెంకన్న సన్నిధిలో మోడిగారు ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మాట మార్చడం జరిగిందన్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీ రాష్ట నాయకులు దేవాలయాలు సందర్శన యాత్ర చేయటం  మీకే చెల్లిందని ఘాటుగా విమర్శించారు.
మీకేమైనా దేవుని పట్ల భక్తి,వున్నట్లయితే మీ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విదంగా మీరు పోరాటం చెయ్యాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మీరు చెప్పే మాటలు, చేసే డ్రామాలు ఆంధ్ర  ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బిజేపీ రాష్ట నాయకులు ఢిల్లీ పెద్దలతో ఆంధ్ర ప్రదేశ్ హోదా పై పోరాటం చెయ్యాలని అలా కాకుంటే రాష్ట్రంలో రాజకీయ లబ్ది కోసం మీరు దేవాలయాల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయడం ద్వారా మీకు ఒరిగేది ఏమీ లేదన్నారు.నిత్యావసరాల ధరలు మండిపోతుంటే  సామాన్యుల బ్రతుకు కష్టంగా మారితే, వాటి గురించి బిజేపీ నాయకులు నోరు మెదపడం లేదని అన్నారు. బీజేపీకి కాలంలో చెళ్ళిందని కేంద్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుందని అన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Like the BJP temple tours that cheated Thirumaleshuni!
Youth Congress

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page