తుంగభద్ర నదికి వరద ముప్పు… ప్రమాద హెచ్చరికలు జారీ

0 14

మంత్రాలయం నది తీరంలో బందోబస్తు
మంత్రాలయం ముచ్చట్లు :

కర్ణాటకలో అధిక వర్షాలు పడడంతో తుంగభద్ర డ్యాంనిండు కుండలా  పరవళ్లు తొక్కుతోంది. దీంతో డ్యామ్ అధికారులు మంగళవారం  33 గేట్లు తెరిచి డ్యాం లోని నీటిని తుంగభద్రా నదిలోకి వదిలారు. దీంతో తుంగభద్ర నది  డ్యామ్ నీరు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతోంది. నదీతీర ప్రాంతాలు మండలంలోని గ్రామాలు మంత్రాలయం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్ర స్వామి మఠం నది కైరవాడి నాగలదిన్నె గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆదోని ఆర్టీవో నదీ తీర ప్రాంతాలలో అధికారులను హెచ్చరించారు. మంత్రాలయం తాసిల్దార్ దేవా చంద్రశేఖర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండంతో రాఘవేంద్ర స్వామి మఠం సమీపంలోని  పుష్కర ఘాట్ లోకి స్థానాలకు ఎవరు వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిఐ.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఎస్సై వేణుగోపాల్ రాజు, బాబు నది తీర ప్రాంతంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.   శ్రీ మఠం అధికారులు కూడా శ్రీ మఠం సిబ్బందితో నది తీర ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.  వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు స్నానాలకు నదిలోకి ఎవరు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశారు. వరద నీరు అదికంగా  రావడంతో నదిలో నుండి పాములు మోసళ్ళు చేపలు  వస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రాలయంలో ఒక బారీ చేప ఎగురుతు ఉంటే కరెక్ట్ గా ఒక బారీ మొసలి నోరు తెరవటంతో  ముసలి నోట్లోకి బారీచేప ఇరుక్కు పడింది.  ఆ దృశ్యం  చూపరులను ఆశ్చర్యంతో  పాటు సంతోషాన్ని నింపింది.తర్వాత ఒళ్ళు జలదరించి  ఆ దృశ్యాన్ని చూసి చూపరులు భయంతో దడుసుకున్నారు. వరద నీటిని చూడడానికి కూడా ప్రజలు అధిక సంఖ్యలో తుంగా తీరం చేరుకున్నప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండటంతో దూరంనుంచి ప్రజలకు వీక్షించారు. శ్రీ మఠం పీఠాధిపతులు మంగళవారం హాస్పిటల్ లోని తుంగభద్ర డ్యామ్ చేరుకొని వరద నీటిని సమీక్షించారు. అనంతరం తుంగభద్రా నదికి పూజలు చేసి హారతులు ఇచ్చారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Flood threat to Tungabhadra river … Danger warnings issued

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page