దాడికి పాల్పడిన ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలి…

0 13

– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి. ఖుతుబొద్దిన్ పాషా

కోరుట్ల  ముచ్చట్లు :

 

- Advertisement -

నియోజకవర్గం లోని మల్లాపూర్ మండలం వెంకట్రావు పేటలో సోమవారం రాత్రి
పోలీసులపై దాడికి పాల్పడిన ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఇసుక దొంగలు దాడికి పాల్పడడం అమానుషమైన చర్య అని అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు ఓవైపు కృషి చేస్తున్నప్పటికీ కొందరు ఇసుక దొంగలు కొంతమంది పెద్దల ప్రోత్సాహంతో ఇసుక అక్రమ వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా ముక్కలు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక అక్రమ రవాణాను కొంతమంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సహకారంతో ఇసుకను తరలిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై దాడికి పాల్పడిన ఇసుక దొంగలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ యూత్ అధ్యక్షులు జెట్టి లక్ష్మణ్ ,కాంగ్రెస్ యూత్ నాయకులు కోటగిరి చైతన్య, మొహమ్మద్ షరీఫ్ ఖాన్, రంగుల అశోక్, ఇతరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Strict action should be taken against the sand mafia responsible for the attack …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page