దారిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోండి- తహసీల్దార్ కు గ్రామస్థులు వినతి

0 56

రామసముద్రం ముచ్చట్లు:

జమీందారుల కాలం నుంచి ఉన్న దారిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ రాముకు గుంతవారిపల్లిదిన్నె గ్రామస్థులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుంగనూరు నుంచి రామసముద్రం మార్గంలోని రచ్చ బస్టాప్ నుంచి ఉన్న దారిని కొంత మంది ఆక్రమించుకున్నారని ఆరోపించారు. దీనితో కొంతమంది దారిని వదలడానికి సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తి మాత్రం మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండని బెదిరుస్తున్నట్లు తహశీల్దార్ రాముకు విన్నవించుకున్నారు. దారి ఉండడం వల్ల వ్యవసాయ పనులకు వెళ్ళడానికి, పశువులను మేపు కోవడానికి అనుకూలంగా ఉండేదన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దారిని ఆక్రమించడంతో పాటు దారికి ముళ్ల కంచె వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయారు. అధికారులు స్పందించి మాకు బండిబాట దారిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు తహశీల్దార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, రాధాకృష్ణ, ద్వారకనాథరెడ్డి, సోమశేఖర్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, మునిరాజ, నారాయణ, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Take action against those who encroached on the road- Villagers request to Tehsildar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page