నదీ తీర ప్రాంతాలను సందర్శించిన ఆర్డీవో

0 19

ఆదోని ముచ్చట్లు :

 

కర్ణాటక రాష్ట్రంలో భారీగా వర్ష పాతం నమోదైన కారణంగా హోస్పేట్ తుంగభద్ర డ్యామ్ లో భారీగా వరద నీరు తో నిండు కుండ ల ఉన్న డ్యాం సోమవారం మధ్యాహ్నం 01గంటలకు 33 గేట్లు ఎత్తి సుమారు లక్ష 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా మంగళవారం ఆదోని ఆర్డీవో జి. రామకృష్ణ రెడ్డి డివిజన్ లోని నదీ తీర ప్రాంతాలను పర్యటిస్తూ ప్రజలు ఎవరు నదీ తీరానికి ఎవరు రావద్దున్నారు, నది తీరంలో కి మత్స్యకారులు చేపల వేటకి వెళ్లదన్నారు,ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆర్డిఓ ఆదేశించారు.
నేపథ్యంలో ఆదోని డివిజన్లోని నది తీరంలో ఉన్న మండల స్థాయి అధికారులందరూ నిరంతరం అప్రమత్తంగా ఉండండి ఉదృతంగా ప్రవహించే వాగులు, వంకలోకి ప్రజలెవరూ దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకొని ఉదృతంగా ప్రవహించే వాగులు, వంకలోకి ప్రజలెవరూ దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని డివిజన్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సిబ్బంది అందరూ కూడా అందుబాటులో ఉండి ఎక్కడ ఏ అవసరం వచ్చినా వెంటనే తరలివెళ్లి ప్రజలకు సాయం చేసేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.’

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags: Ardeavo visiting riverine areas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page