పాజిటివ్ ఉన్నా దర్జాగా తిరిగేస్తున్నారు…

0 23

హైద్రాబాద్       ముచ్చట్లు:

గరంలో కరోనా మహమ్మారి విజృంభణతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐదు నెలల్లో 41వేల పాజిటివ్ కేసులు నమోదై రాష్ట్రంలో ముందంజలో నిలిచింది. వైద్యశాఖ వైరస్ సోకిన వారిలో కొంత మందికి గాంధీ ఆసుపత్రుల్లో చికిత్సలు అందిస్తుండటంగా మరికొంత మందిని హోం క్వారంటైన్ చేసి వైద్యం సేవలు అందిస్తారు. స్థానిక వైద్యులు రోజుకోసారి రోగుల ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించి వ్యాధి తగ్గేవరకు చర్యలు తీసుకుంటారు. నగరంలో ఇప్పటివరకు 21వేలు మంది హోం క్వారంటైన్ చేయగా, ఇప్పటి వరకు 14వేల మంది చికిత్స పొంది కోలుకున్నారు. మరో 7500 మంది వైద్యం పొందుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. కానీ హోం క్వారంటైన్ ఉన్న రోగులు కొంతమంది ప్రజల మధ్య తిరుగుతున్నట్లు, దుకాణాల వద్దకు వెళ్లి సరుకులు తీసుకోవడం వంటి పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు అడ్రస్సు మార్చుతున్నారు.మరుసటి రోజు ఎఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ఇంటికి వెళ్లి తనిఖీ చేస్తే సొంతూరు వెళ్లినట్లు సమీప ప్రజలు చెబుతున్నారు.

 

- Advertisement -

అదే విధంగా ప్రభుత్వం 15 రోజులుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తుంది. గత వారం రోజుల నుంచి జనం రద్దీ పెరగడంతో పరీక్షల ఫలితాలు ఆరగంటలో ఇవ్వలేక రెండు రోజులకు తెలుపుతున్నారు. అయితే రక్త నమూనాలు ఇచ్చిన వ్యక్తులు వివరాలు, ఫోన్ తీసుకుని ఫలితాలు మెసేజ్ చేస్తామని చెప్పుతూ మరుసటి ఫోన్ చేస్తే ఆసుపత్రికి వస్తామని చెబుతూ తరువాత అందుబాటులో ఉండటం లేదని ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వెల్లడిస్తున్నారు. పాజిటివ్ కేసులుగా తేలిన వారు తమ వైరస్ సోకిన విషయం బయట పడుతుందని, చికిత్స చేయించుకోకుండా దర్జాగా ప్రజల మధ్య తిరుగుతూ కరోనా విజృంభణకు కారకులైతున్నారని వైద్యులు భావిస్తున్నారు. వారి గుర్తించడం కష్టంగా మారిందని పేర్కొంటున్నారు.నగరంలో జీహెచ్‌ఎంసీ అధికారులు 08 కంటైన్‌మెంటు జోన్లు విభజించి నిబంధనలు కఠినంగా అమలు చేసిన పాజిటివ్ కేసులు ఎక్కువ నమోదైతున్నాయని,ప్రజలు మహమ్మారిపై జాగ్రత్తలు పాటించకుండా నిత్యావసర సరుకులు పేరుతో గుంపులుగా చేరి వైరస్ విస్తరించేలా చేస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము గత ఐదునెలల నుంచి విరామం లేకుండా శ్రమిస్తే ప్రజలు నిర్ల-క్షం వహిస్తూ కరోనా వ్యాప్తి చెందేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. హోం క్వారంటైన్ రోగులపై ప్రత్యే నిఘా పెట్టడంతో పాటు, ర్యాపిడ్ టెస్టుల్లో పాజటివ్‌గా తేలినవారిని వెంటనే గుర్తించి ఆసుపత్రిలో చేరాలా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజలు చూడాలని జిల్లా వైద్యాధికారులు కోరుతున్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Returning to the ranks despite being positive …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page