పాత బిడ్జీ కూలక మునుపే కొత్త బిడ్జీ నిర్మాణం జరగాలి

0 18

– సీపీఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ డిమాండ్

నంద్యాల ముచ్చట్లు :

- Advertisement -

కుందు నది మద్ది లేరు వాగుపై నిర్మిస్తున్న వంతెనను నత్తనడక గా కాకుండా త్వరగా పూర్తి చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ కుందు నది పై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగిందన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి  డి శ్రీనివాసులు నందమూరి నగర్ సిపిఐ శాఖ కార్యదర్శి హుస్సేన్ సా పాల్గొన్నారు.అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ కుందూ నది పై గత టిడిపి ప్రభుత్వ కాలం నుండి ఇప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరకు సంవత్సరాల నుండి  కుందూ నదిపై వంతెన నిర్మించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం వచ్చిందంటే జీవాల సంత వల్ల అక్కడ   పాత బ్రిడ్జి అంతా ట్రాఫిక్ జామ్ అవుతుందని అన్నారు. ఆ బరువుకు పాత బ్రిడ్జి కూలుతుంది అని ప్రజలు భయపడుతూ ఉంటారని తెలిపారు. అంతేకాకుండా వేల సంఖ్యలో వాహనాలు ఎస్ ఆర్ బి సి. నందమూరి నగర్. వైయస్ నగర్. పులిమద్ది మునగాల. పోలూరు .. అనేక గ్రామాల ప్రజలు ఆ బ్రిడ్జి మార్గం ద్వారా  రాకపోకలు జరుగుతూ ఉంటాయన్నారు. కావున తొందరగా పాత బ్రిడ్జి కూలకమునుపే కొత్త బిడ్జీ నిర్మాణం పనులు చేయాలని కోరారు.కాంట్రాక్టు వారు వర్షాకాలం వస్తే పనులు ప్రారంభింస్తారని తూతూమంత్రంగా పనులు మొదలు పెట్టి. వరదలు వచ్చి వంతెనకు తోలిన కంకర సీమెంట్  వరదలో కొట్టుకుపోయిన వని మరలా బిల్లు పెట్టుకుని ఆ రకంగా ప్రభుత్వ సొమ్మును గండి కొడుతూ కాలయాపన చేస్తు ఉంటారని ఆయన అన్నారు. ఇప్పటికైనా  ఆ వంతెనను త్వరగా పూర్తి చేయాలి అని అన్నారు. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి గా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  చిన్న నాగన్న వెంకటరమణ లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: The new bidji must be built before the old bidji kulaka

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page