పుంగనూరులో దిశయాప్‌తో మహిళలకు రక్షణ -కౌన్సిలర్‌ అమ్ము

0 83

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశయాప్‌తో ఆపదలో ఉన్న మహిళలకు ప్రత్యేక రక్షణ లభిస్తుందని అంజుమన్‌ కమిటి కార్యదర్శి , కౌన్సిలర్‌ అమ్ము తెలిపారు. మంగళవారం కౌన్సిలర్లు నయీంతాజ్‌,సాజిదాబేగం,రాఘవేంద్ర,కమలమ్మ,ఆదిలక్ష్మి,మమతలు వారి వార్డుల్లో దిశయాప్‌పై అవగాహన కల్పించారు. ఉబేదుల్లాకాంపౌండులో కౌన్సిలర్‌ అమ్ము ఇంటింటికి వెళ్లి మహిళల సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. దీని ద్వారా ఎలాంటి ఆపదలో ఉన్న మహిళలు సెల్‌ఫోన్‌ను గట్టిగా చేతులతో ఆడిస్తే ఎస్‌వోఎస్‌ సిస్టమ్‌ ద్వారా పోలీస్‌ కంట్రోల్‌రూముకు సమాచారం చేరి, క్షణాల్లో మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags: Sell care-women counselor with direction in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page