పేదల ఆహార భద్రత కోసమే రేషన్ కార్డులు : సండ్ర వెంకట వీరయ్య

0 18

సత్తుపల్లి ముచ్చట్లు :

పేదలకు ఆహార భద్రత కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం  కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు వేల నాలుగు వందల ఇరవై కార్డులు మంజూరు కాగా, వేంసూరు మండలంలో  294 లబ్ధిదారులు ఆహార భద్రత కార్డులు మంజూరు జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 వేల 111 కార్డులు లబ్ధిదారులకు పంపిణీ జరుగుతుందన్నారు.   అర్హులందరికీ ఆహారభద్రతా కార్డులు అందజేస్తామని, రాని వారు ఆందోళన చెందవద్దని, రెండో విడతలో అర్హులందరికీ అందుతాయని పేర్కొన్నారు. భద్రత కార్డుల ద్వారా వచ్చే నెల ఆగస్టు నుంచి రేషన్ పొందవచ్చని తెలిపారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Ration cards for food security of the poor; Mmelye Sandra Venkata Virayya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page