ప్రోద్దుటూరు లో టెన్షన్..టెన్షన్

0 11

ప్రోద్దుటూరు ముచ్చట్లు:
కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బిజెపి రాష్ట్ర వ్యాప్తిత ఆందోళనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు సోమూ వీర్రాజు ప్రొద్దుటూరు పర్యటనకు రావడంతో ఉద్రిక్త పరిస్థితిని తెచ్చిపెట్టింది.  విగ్రహం ఏర్పాటు చేసే మైదుకూరు రోడ్డులోని జిన్నారోడ్డు సర్కిల్లో  బిజెపి పెద్ద ఎత్తున చేయాలని ఛలో ప్రొద్దుటూరుకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధులను బారికేడ్లతో దిగ్భంధనం చేశారు. మైదుకూరు రోడ్డు, శివాలయం వీధి, హోమసపేట వీధులనుంచి ధర్నా ప్రదేశానికి జనం ఎవరూ రాకుండా కట్టడి చేశారు. దీంతో ప్రొద్దుటూరులో సామాన్య  జన సంచారానికి ఇబ్బందులు ఏర్పాడ్డాయి. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమూ వీర్రాజు, ఇతర జిల్లా నేతలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. సోమూ వీర్రాజు ఆందోళనకోసం రాత్రే రహస్యంగా పోలీసుల కళ్లుగప్పి కడప నుంచి ప్రొద్దుటూరుకు చేరుకున్నట్లు సమాచారం. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశంపై బిజెపి గట్టి ఆందోళనకు ఉపక్రమించడంతో ప్రొద్దుటూరులో ఎప్పుడు ఏంజరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. అయితే సోమూవీర్రాజు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గోర్రెశ్రీనివాసులు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళనను ఏదో ఒక రూపంలో చేసి తీరుతామని వారు స్పష్టం చేశారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Tension in Proddatur..tension

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page