మందులే కాదు… మనోధైర్యం కూడా ముఖ్యమే – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి 

0 43

రామసముద్రం ముచ్చట్లు:

మందులే కాదు మనోధైర్యం కూడా అవసరమేనని స్థానిక కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ కేంద్రమైన కెసిపల్లి గ్రామంలో ఇద్దరికి పాజిటివ్ రావడంతో మంగళవారం ఐసోలేషయన్ కిట్లు అందజేశారు. అనంతరం పలువురికి కరోన నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన భారిన పడిన వారు అధైర్య చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సకాలంలో స్పందించాలని ఎమ్మెల్యే నవాజ్ బాషా అధికారులను ఆదేశించారన్నారు. అనంతరం పంచాయతీలో నమోదు అవుతున్న కరోన కేసుల వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారన్నారు. ప్రజలు కూడా అనవసరంగా బయట తిరక్కుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్ రాధాకృష్ణ, ఏఎన్ఎం సుగుణమ్మ, మహిళా పోలీస్ గౌతమి, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, ఆశ వర్కర్లు మంజుల, రాధమ్మ, వాలింటర్లు రెడ్డెమ్మ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Not just drugs … Courage is also important – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page