మన్సాస్ ట్రస్టులో అశోక్ కు ఊరట

0 14

విజయవాడ ముచ్చట్లు :

 

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ట్రస్ట్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ తన ఆదేశాలు పాటించడం లేదని దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. మాన్సాస్ ట్రస్ట్ ఈవోపైఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈవో పాత్ర ఏంటి.. ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించింది. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదని.. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్‌గజపతి ఆదేశాలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను కోర్టు సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న ఇన్‌స్టిట్యూషన్స్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఈవోకు ఆదేశించింది. ట్రస్ట్ సిబ్బంది జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్టేట్ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. పాలకమండలి ఏర్పాటు జీవో 75పై కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది.మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌కు లేఖ రాసేముందు కోర్టు తీర్పును ఎందుకు చూడలేకపోతున్నారని ఈవోను హైకోర్టు ప్రశ్నించింది. ఆడిట్ పేరిట ఎవరెవరో వస్తున్నారని సీనియర్ న్యాయవాది జీవీ సీతారామమూర్తి, న్యాయవాది అశ్విని కుమార్‌లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆడిట్‌తో ఈవోకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని ఆదేశించిన హైకోర్టు.. మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Ashok to Mansas Trust

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page