వైభవంగా గురు పౌర్ణమి పూజలు

0 10

కడపముచ్చట్లు :

 

కడప లో ఈరోజురామకృష్ణ మిషన్ లో గురు పౌర్ణమి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామి సన్నివాసానంద, బ్రహ్మచారి యోగి రాజ చైతన్య స్వామి సుకృతానంద భగవాన్ శ్రీ రామకృష్ణులకు విశేష పూజ హోమం నిర్వహించారు. అనంతరం స్వామి సుకృతానందజీ గురుపౌర్ణమి విశిష్టతను వివరిస్తూ ” గురువు మాత్రమే భగత్ దర్శనం చేయించ సమర్ధుడని, గురువును, గురువాక్యాలను విశ్వసించి ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు తప్పక భగవల్లాభం పొందగలరని” చెప్పారు.స్వామి శశికాంతానందజీ తమ సందేశాన్ని స్తూ” భారతీయ సనాతన ధర్మం లో గురువు పాత్ర విశిష్టమైనదని,రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఆదర్శవంతమైన గురుశిష్యులని, ఆధునిక కాలంలో వారి అనుబంధం ఆచరణీయ విధానమని” తెలిపారు.అనంతరం స్వామి సుకృతానందజీ రామకృష్ణ మిషన్ – కడప కార్యదర్శి బాధ్యతలను స్వామి శశికాంతానందజీకి అప్పగించారు.స్వామి సుకృతానంద స్వామి శశికాంతానందను కడప భక్తులకు పరిచయం చేస్తూ”  స్వామి శశికాంతానందజీ కార్య దక్షత కలవారని, అందరినీ ఏకతాటి మీద నడిపించి సమర్ధవంతంగా కార్యక్రమాలు నిర్వహించ గలరని, గతంలో మీరు సహాయ సహకారాలు అందించిన విధంగానే స్వామి శశి కాంతానందజీ కి కూడా సహకరించి, రామకృష్ణ మిషన్ – కడప ను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆ బాధ్యత మీ అందరి మీద ఉందని అన్నారు.భక్తులందరూ యథా శక్తి గా స్వామి సుకృతానందజీ ని సన్మానించి వారి కృతజ్ఞతలు తెలియజేశారు.
అత్యంత వైభవంగా జరిగినఈ కార్యక్రమం లో స్వామి సన్నివాసానంద, స్వామి సంకర్షణానంద, స్వామి సర్గానంద, బ్రహ్మచారి యోగి రాజ చైతన్య, బ్రహ్మచారి శివేశ చైతన్య, బ్రహ్మచారి రాహుల్, పాల్గొన్నారు. శివరామిరెడ్డిగారి వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.భక్తులందరికి భోజన ప్రసాదం అందజేశారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Guru Purnami Pujas in glory

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page