సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం- సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 37

– 97శాతం మ్యానిఫెస్టో అమలు
రామసముద్రం ముచ్చట్లు:

సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సచివాలయంలో పింఛన్లు, హౌసింగ్ తదితర అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం ఏర్పడిన వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పాలన సాగిస్తుండడంతో ఆదర్శ సీఎంగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిలిచిపోయారని కొనియాడారు. ఎన్నికల మునుపు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా గుర్తించి మ్యానిఫెస్టోను రూపొందించారన్నారు. అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల వ్యవధిలో 97 శాతం హామీలను అమలు చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. అంతేకాకుండా జాతిపిత మహాత్మాగాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం కోసం ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల వ్యవధిలోనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. సచివాలయంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి సంక్షేమ పథకాలను వాలింటర్ల ద్వారా నేరుగా ఇంటికే అందుస్తున్నారని కొనియాడారు.స్థానిక శాసనసభ్యులు నవాజ్ బాషా కూడా ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నారన్నారు. అనంతరం వాలింటర్ల క్లస్టర్ వారీగా పింఛన్లు, హౌసింగ్ పై సమీక్షించారు. అలాగే గ్రామంలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లు ప్రజలు వినతులు చేస్తే, వాలింటర్లు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే ఆ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషాకు తెలియజేసి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, సచివాలయ సిబ్బంది భారతమ్మ, మూర్తి, బత్తెమ్మ, గౌతమి, రేణుక, సుగుణమ్మ, వీఆర్ఏ మహ్మద్ రఫీ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, వాలింటర్లు రేవతి, రెడ్డెమ్మ, శ్రావణి, పుష్పావతి, మేఘన, కుమారస్వామి, దినకర్, ప్రదీప్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Welfare is the goal of CM Jagan- Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page