సోమల చెరువులో గుర్తు తెలియని మృతదేహం

0 32

హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో పరిశీలిస్తున్న పోలీసులు

 

సోమల ముచ్చట్లు :

 

- Advertisement -

సోమల మండలం నెల్లి మంద పంచాయతీ కంచం వారి పల్లె గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువులో గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ ఉండగా పశువుల కాపర్లు గుర్తించి గ్రామంలో చెప్పడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి దాదాపు 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవచ్చని నడుముకు రాళ్లు కట్టబడి ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి శవం పైకి తేలకుండా నడుముకు కట్టి పడేసారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా మృతి చెందిన వ్యక్తి ఈ ప్రాంతవాసి కాదని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోకి గుర్తుతెలియని వ్యక్తి ఎందుకు వెళ్ళాడు, వెంట ఇంకా ఎవరైనా వెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం పూర్తిగా చెదిరిపోయి ఉండడంతో చెరువు నుండి తీసి తరలించడానికి వీలు కాకపోవడంతో రేపు శవపంచనామా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Unidentified body found in Somala pond

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page