5 భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్  

0 16

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బాహుబ‌లి సినిమాతో యావ‌త్ ప్ర‌పంచాన్నే టాలీవుడ్‌వైపు చూసేలా చేశాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ తో మ‌రోసారి త‌న స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌య్యాడు. జూనియ‌ర్‌ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా వ‌స్తున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ ఒక్క‌టే కాదు.. ఇండియ‌న్ సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు అన‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మైన ఈ పాన్ ఇండియ‌న్ మూవీని అక్టోబ‌రు 13న విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లుపెట్టేశారు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్ పేరిట ఒక ప్ర‌త్యేక పాట‌ను రూపొందించాడు సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి.స్నేహం విలువను చాటిచెప్పే ఈ సాంగ్‌ను ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా ఆగ‌స్టు 1న విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగు, తమిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌లో ఈ పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సాంగ్‌ను ఒక్కో భాష‌లో ఒక్కో సింగ‌ర్‌తో పాడించాడు కీర‌వాణి. దీంతో ఆయా భాష‌ల్లో ఈ పాట‌ను పాడే సింగ‌ర్ ఎవ‌రా అని అంద‌రిలో ఆస‌క్తి మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ ఒక ఫొటోను విడుద‌ల చేసింది చిత్ర బృందం. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్ ఈ పాట‌ను ఆయా భాష‌ల్లో ఆల‌పించారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; RRR in 5 languages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page