ఆగిపోయిన గుండెకు ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..

0 18

కరీంనగర్‌ ముచ్చట్లు :

 

అంబులెన్స్‌ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌లో చోటుచేసుకుంది. మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సీరియస్‌ కండిషన్‌లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అంబులెన్స్‌లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Ambulance crew suffocated to a stopped heart ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page