ఆగ‌స్టులో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

0 13

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగ‌స్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ‌స్టు 4 నుండి 6వ తేదీ వ‌ర‌కు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. ఆగ‌స్టు 7, 14, 21, 28వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. ఆగ‌స్టు 7న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 8న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. ఆగ‌స్టు 22న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Special festivities at Sri Kodandaramalayam in August

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page