ఆన్ లైన్ పేపర్లు చదివేందుకు ఆసక్తి

0 10

మెదక్ ముచ్చట్లు :

 

రోజూ పొద్దుగాల పేపర్‌, పేపర్‌ అంటూ బారు వచ్చి న్యూస్‌ పేపర్‌ వేసి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఇంకో శబ్ధం వినిపిస్తుంది. ‘పేపర్లు కొంటాం’ అంటూ ఓ సంచి తగిలించుకుని సైకిల్‌ లేదంటే మోటార్‌ సైకిల్‌పై తిరుగుతారు. పాత న్యూస్‌పేపర్‌ కొంటాం అని గల్లీలు, బస్తీలకు వస్తారు. రోజు మధ్యాహ్నం వరకు 50 కిలోల నుంచి క్వింటాల్‌ వరకు పాత న్యూస్‌పేపర్‌ కొని వారి దుకాణాల వద్దకు తీసుకెళ్లేవారు. ఇదంతా కరోనాకు ముందు పరిస్థితి. ఇప్పుడు పేపర్‌ అని ఎంత సేపు అరిచినా ప్రయోజనం కనిపించడం లేదు. రోజుకు కనీసం 5కిలోల న్యూస్‌పేపర్‌ అమ్మేవారు కరువయ్యారంటే అతిశయోక్తి కాదు. పేపర్‌ కొనే వారి బతుకులపై కరోనా కాటు వేసింది.కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో చదివేందుకే మొగ్గుచూపుతున్నారు. కరోనా రాకుండా జాగ్రత్తలు పడడం పేరుతో ఖర్చును తగ్గించుకుంటున్నారు. దీంతో న్యూస్‌పేపర్‌ వేసుకునే వారిసంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో పాత న్యూస్‌ పేపర్‌ అమ్మేం దుకు అవకాశం లేదు. పాత న్యూస్‌పేపర్‌ కొనడమే కొంతమంది వృత్తి. దానిపైనే వారి కుటంబ జీవనాధారం. న్యూస్‌ పేపర్‌ వేసుకునే వారు తగ్గడంతో అమ్మడం పైనా ప్రభావంచూపింది. ఇది పాత పేపర్‌ కొనే వారి బతుకులను ఆగం చేసింది.కరోనా ముందు వరకు పాత న్యూస్‌పేపర్‌ అమ్మేవాల్లు ఎక్కువ. శుభకార్యాలు, పండగలు, దావత్‌లు నిత్యం జరుగుతుండేవి. దీంతో ఇండ్లు శుభ్రం చేసుకోవడం, కొందరు కొత్త రంగులు వేసుకోవడంతో సామాను మొత్తం బయటికి తీసేవారు.

 

 

 

- Advertisement -

అందులో ఉపయోగం లేనివి, పాత న్యూస్‌పేపర్‌ను అమ్మేవాళ్లు. కరోనా నేపథ్యంలో శుభకార్యాలు, పండగలు, దావత్‌లు తగ్గిపోయాయి. ఇండ్లు మారేవారు, రంగులు వేసుకునే వారు కరువయ్యారు. దీంతో సామాను, పాత న్యూస్‌పేపర్‌ అమ్మడం పూర్తిగా తగ్గింది. దీంతో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది బతుకులు దయనీయంగా మారాయి. వారి వ్యాపారం సక్రమంగా సాగకపోవడంతో ఛిద్రమయ్యాయి. దుకాణం, ఇల్లు కిరాయిలు కట్టేందుకూ అవస్థలు పడుతున్నారు. కరెంటు బిల్లు, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఇంకా అదనం.ఇక పిల్లల స్కూల్‌ ఫీజులు, వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతు న్నాయి. రోజు వారి జీవనమే కష్టంగా మారిన పరిస్థితుల్లో ధరల పెరుగుదల, అదనపు ఖర్చులతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఆన్‌లైన్‌లో పాత సామాను, న్యూస్‌పేపర్‌ను కొనే సంస్థలు, యాప్‌లు ఉండడమూ వారి బతుకులపై కోలుకోలేని దెబ్బపడింది. కరోనా, లాక్‌డౌన్‌తో దీనస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Interested in reading online papers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page