ఈటల రాజేందర్ ది దొంగ ఏడుపు

0 10

కరీంనగర్ ముచ్చట్లు:

 

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రెండేవ విడత గొర్రెల పంపిణీ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు, మంత్రి మాట్లాడుతూ గొర్ర కురుముల గురించి ఏనాడు ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కేసీఆర్ సంకల్పం వల్లనే మనకు గొర్రెలు అందాయి మన బతుకులు మారాయి. కరోనా వల్ల గొర్రెల పంపిణీ లో కొంత గ్యాప్ వచ్చింది. 2వ సారి గొర్రెల పంపిణీ హుజురాబాద్ కోసమే పెట్టారని విమర్శలు చేస్తున్నారు. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేసే కార్యక్రమం కేవలం ఇక్కడ ప్రారంభ కార్యక్రమం మాత్రమే. దళితుల వికాసం కోసం పెట్టిన కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభం కాబోతుంటే వాటిని విమర్శిస్తున్నారు. విమర్శలు చేసే మూర్ఖులకు చెబుతున్నా. హుజురాబాద్ కోసం రైతు బంధు వచ్చిందా, కరెంట్ 24 గంటలు వచ్చిందా వాళ్లే ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి అన్నారు.
కొంత మంది దుర్మాగులు కేసీఆర్ కుటుంబ మీద ఎడుస్తున్నారు. ఆయన ఎవరికోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తోండో అందరికి తెలుసు. హుజురాబాద్ వచ్చే సోకాల్డ్ నాయకుళ్లరా మీరు కేంద్రములో  ఉన్నారుగా ఒక్క నేషనల్ ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా అని అడిగారు. గతంలో ఇక్కడ ఈటెల రాజులా తిరగలేదా ఇప్పుడు మారిండో అందరూ చూస్తున్నారు. ఈటెల రాజేందర్  దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. గొల్లలు కొలిచే మల్లన్న, కురుముల గోలిచే బీరన్న స్వరూపమే మన ముఖ్యమంత్రి కేసీఆర్ . మన జాతి పట్ల కేసీఆర్ ఎంతో గౌరవంతో ఉన్నారని అన్నారు.
నోటి కి వచ్చినట్లు బిజెపి వాళ్ళు మాట్లాడుతున్నరు. మేము సంస్కారంతో ఉన్నాము కాబట్టే మీరు మిగిలారు. మీకు దమ్ము ఉంటే ప్రధాని దగ్గరకి పోయి నిధులు తెండి గొంగ ఏడుపులు ఎడవకండి. ప్రభుత్వం ఉంటే అన్ని రకాల మేలు జరుగుతుందని అన్నారు.వ్యక్తి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కేసీఆర్ నే తెలంగాణ కి శ్రీరామ రక్ష. ఒకాయన కు ఏడేళ్లు లేని ఆత్మగౌరవము ఇప్పుడు గుర్తుకు వచ్చింది. అధికారంలో ఉంటే ఓ లెక్క  లేకుంటే ఓ లెక్కలో మాట్లాడుతున్నరు. టి ఆర్ యస్ కి ఓటు వేయకుంటే పథకాలు ఏమి రావంటూ ప్రచారం చేస్తున్నారు ఇది దుర్మార్గమని అన్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Itala Rajender The thief crying

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page