ఈ ఏడాది ఎంసెట్ ర్యాంక్స్ లో వెయిటేజ్ లేదు: మంత్రి ఆదిమూలపు

0 16

అమరావతి  ముచ్చట్లు:

ఎంసెట్ ర్యాంక్స్ లో ఇంటర్మీడియట్ కు ఇచ్చే 25 శాతం వెయిటేజ్ ఈ ఏడాది ఇవ్వడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టంచేశారు. గత వారమే ఇంటర్‌ ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. స్లిప్ టెస్టులకు 70శాతం, ఫార్మాటివ్ ఎసెస్ మెంట్ కు 30% వెయిటేజ్ తో మార్కుల కేటాయింపులు ఇచ్చామని ఆయన తెలిపారు. ఛాయారతన్ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్న ఆయన… 6.28 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు విడుదల చేయనున్నామని వెల్లడించారు. మరో రెండు, మూడు రోజుల్లో 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కరోనా వల్ల పరీక్షలు రద్దు చేయటంతో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయినట్లేనని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 2020, 2021 సంవత్సరాల్లో పదవ తరగతి విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:No weightage in this year’s Amset Ranks: Minister Primitive

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page