ఎమ్మెల్యే చెన్నమనేని ప్రజలకు క్షమాపణ చెప్పాలి

0 7

వేములవాడ    ముచ్చట్లు:
వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ నేత అది శ్రీనివాస్ మీడియతో మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ నియోజకవర్గం ప్రజలపై కొత్త ప్రేమ ఒలకపోస్తూన్నారు.   17 నెలల గా నియోజకవర్గానికి దూరంగా ఉన్నందున ప్రజలకు క్షమాపణ కోరతారు అనుకున్నాం. కానీ  మనసంతా ఇక్కడే ఉంది..పవిత్ర  బంధం అంటూ కొత్త పలుకులు పలుకుతున్నాడు. నీది పవిత్ర బంధం కాదు.. భారతదేశానికి నీది మోసపూరిత బంధమని అయన విమర్శించారు. 17 మాసాలుగా గా ప్రజలకు ఎందుకు దూరంగా ఉన్నావ్.? ప్రజలకు సమాధానం చెప్పు క్షమాపణ కోరాలి. -భారత దేశ పౌరుడు అంటున్నావు మరి ఎందుకు జర్మనీ దేశ పాస్ పోర్ట్ పై ఎలా వెళ్తున్నా వ్.. సూటిగా ప్రజలకు సమాధానం చెప్పు అని నిలదీసారు. కేంద్ర హోంశాఖ జర్మనీ పాస్పోర్ట్ పైన ప్రయాణం చేస్తున్నావ్ అని చెప్పింది కదా ఇప్పటికీ జర్మనీ పాస్పోర్టు ఉన్నది అన్నది కదా దానికి సూటిగా ఎందుకు సమాధానం చెప్పడం లేదు నీ ఓ సి ఐ కార్డు లో ప్రస్తుతం నీది ఏ దేశం అంటే నువ్వు కార్డు లో ప్రస్తుతం నీది ఏ దేశం అంటే నువ్వు అంటున్నావే భారతదేశం అని అక్కడ భారతదేశమని రాశావా లేదా జర్మని దేశమని రాశావా నీ ఓసిఐ కార్డు వివరాలు ప్రజలకు చెప్పు.   నోరు తెరిస్తే అబద్ధాలే..? భారీ సినిమా డైలాగ్ లతో ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నావ్… అబద్ధాలు ఆట ఇక కొనసాగదు. ఇటీవల సిరిసిల్లలో సీఎం  వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు అంటున్నావ్ కానీ  సీఎం 6 ఏళ్ల క్రితం ఇచ్చిన 450 కోట్ల హామీ ఏమైనదని అన్నారు.  రెండు సార్లు సీఎం వేములవాడ కి వచ్చినప్పుడు జర్మనీలో ఉన్నావ్…అందుకే దేవాలయ అభివృద్ధి కావడం లేదు.  వైఫల్యమే.? మనసంతా ఇక్కడ అంటున్నావే అధికారులతో సమన్వయం అంటున్నావే కథలాపూర్ మేడిపల్లి మండల ప్రజల రైతుల వర ప్రదాయిని అయిన కలికోట సూరమ్మ కుడి ఎడమ కాల్వల పనులు ఇంకా మొదలుకాలేదు.  ముంపు గ్రామాల లో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి నిధులు ఏవి మరి.. ప్రజలను క్షమాపణ కోరాలి.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు..చాల సమస్యలు పేరుకుపోయినావి. నిజం నిలకడ పైన తెలుస్తుంది ఆలస్యం అయినా ధర్మమే గెలుస్తుంది ఆ విశ్వాసం ఉందని అన్నారు.  ప్రజలకు విజ్ఞప్తి. ఈ మోసపూరిత మాటలను విశ్వసించండి. చివరికి న్యాయం ధర్మం గెలుస్తుంది. విశ్వాసం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సంఘ స్వామి యాదవ్, జిల్లా కార్యదర్శి చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అరుణ్ తేజ చారి, చిలివేరి శ్రీనివాస్ పాత సత్య లక్ష్మి మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు తోట లహరి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ, కార్యదర్శి గే0టల ప్రకాష్, సాబీర్ కోలకాని రాజు, దూలం భూమేష్ గౌడ్, తదితరులు ఉన్నారు..

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Ms Chennamane should apologize to the people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page