కర్ణాటక సీఎంగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం

0 20

బెంగళూరు ముచ్చట్లు :

 

కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆయన చేత ప్రమాణం స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం ముందు మాజీ సీఎం యడియూరప్ప బసవరాజ్ బొమ్మయ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మంగళవారం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Basavaraj Bommai sworn in as Karnataka CEO

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page