కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల వివక్షత చూపుతున్నాయి

0 13

ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ధర్నా
తుంగతుర్తి   ముచ్చట్లు :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా డబ్బులు చెల్లించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులాల వారిగా విభజించి డబ్బులు చెల్లించడం సరైనది కాదని ఎంఎస్ ఎఫ్  తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తడకమళ్ళ రవి కుమార్  అన్నారు. మంగళవారం నాడు తుంగతుర్తి మండల ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ డబ్బులు చెల్లించే విషయంలో దళితులకు తప్ప మిగతా అన్ని బీసీ, ఓసీ,  మైనార్టీ కులాల వారికి డబ్బులు చెల్లించారాని తెలిపారు ధర్నా అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్  గారికి వినతిపత్రం అందజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కుల వివక్షతను ప్రోత్సహిస్తూ విభజించు పాలించు అనే సిద్ధాంతంతో దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఇప్పటికైనా తన ఆలోచనను విధానాన్ని సరి చేసుకోకపోతే వచ్చే ఎన్నికలలో దళితులందరూ ఏకమై అపార్టీలకు పుట్టగతులు లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లెపాక రాంబాబు , బొంకూరి మల్లేష్ , బొంకూరి సురేష్ , పాల్వాయి సందీప్ , బొంకూరి మధు కొండగడుపుల వెంకటేష్ , బొంకూరి నరేష్ , తడకమళ్ళ వెంకన్న , మంగళపల్లి వెంకన్న ,  మరియమ్మ ,వెంకటమ్మా , కాసర్ల రాజశేఖర్ ,  బొంకూరి వెంకటేష్ , తడకమళ్ళ సురేష్ , చింతకుంట్ల సురేష్ , తడకమళ్ళ మధు , కృష్ణ , బానుప్రకాశ్ ,మహేష్ , అచ్చమల్లు , సతీష్ , కొండ మధు తదితరులు పాల్గొన్నారు.స్పాట్ విజువల్స్.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Central and state governments are discriminating against castes

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page