కోర్టు మొట్టికాయలు తప్పవా…

0 15

గుంటూరు    ముచ్చట్లు :

రాజ‌కీయ నేత‌ల కార‌ణంగా.. పాల‌కుల‌కు ప‌రువు పోవ‌డం, రావ‌డం అనేవి స‌హ‌జం. అధికార పార్టీలో ఉన్న నేత‌లు.. అత్యంత అప్ర‌మ‌త్తంగా వ్యవ‌హ‌రించాలి. లేనిప‌క్షంలో ఏ చిన్న తేడావ‌చ్చినా.. అధికార పార్టీపైనా.. పాల‌కుల‌పైనా ప్రభావం ప‌డుతుంది. అందుకే.. పాల‌న చేసేవారు.. ఇటు పాల‌న‌పైనా.. అటు పార్టీపైనా కూడా ఓ క‌న్నేసి ఉంచుతారు. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ పాల‌న‌లో దీనికి భిన్నమైన ప‌రిస్థితి కనిపిస్తోంది. వైసీపీ నేత‌ల వ‌ల్ల.. చిన్న చిన్న ఇబ్బందులు వ‌స్తుంటే.. జ‌గ‌న్ ప్రభుత్వంలోని సీనియ‌ర్ అధికారుల వ్యవ‌హారంతో సీఎం ప‌రువు బ‌జారున ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర స‌ర్కారులో ప‌నిచేస్తున్న అధికారుల‌పై హైకోర్టు కోర్టు ధిక్కర‌ణ కేసులు న‌మోదు చేయిస్తోంది. ఆయా కేసులు ఏమ‌న్నా.. భారీ ఎత్తున పెద్దవా అంటే అదేమీకాదు. అయిన‌ప్పటికీ.. కేసులు మాత్రం న‌మోద‌వుతున్నాయి. దీంతో ఆయా కేసుల విచార‌ణ సంద‌ర్భంగా.. కోర్టు.. సంబంధిత అధికారులు ఏస్థాయిలో ఉన్నప్పటికీ.. కోర్టుకు పిలిచి బోనులో నిల‌బెడుతోంది. గ‌తంలో ప్రభుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నీలం సాహ్ని .. మూడు సార్లు కోర్టు మెట్లు ఎక్కారు. అదేవిధంగా డీజీపీ కూడా కోర్టు మెట్టు ఎక్కక త‌ప్పలేదు.ఇక‌, ఇటీవ‌ల తాజాగా.. ప్రత్యేక కార్యద‌ర్శి.. కేవీవీ స‌త్యనారాయ‌ణ‌ కూడా కోర్టు ఆగ్రహానికి గుర‌య్యారు. ఈయ‌న‌ను వెంట‌నే అరెస్టు చేసి.. మేజిస్ట్రేట్ ముందుకు హాజ‌రు ప‌ర‌చాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించ‌డం.. ప్రభుత్వ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం సృష్టించింది. అయితే ఈ ఘ‌ట‌న‌ల‌న్నింటినీ ప్రతిప‌క్షాలు స‌హా ప్రభుత్వ వ్యతిరేక మీడియా భూత‌ద్దంలో చూస్తున్నాయి. జ‌గ‌న్‌ను పాల‌న‌ను టార్గెట్ చేస్తూ.. పెద్ద ఎత్తున విమ‌ర్శలు వండివారుస్తున్నాయి. కానీ, నిజానికి కోర్టు మెట్లు ఎక్కుతున్న వారిని ప‌రిశీలిస్తే.. వీరేమ‌న్నా.. పెద్ద పెద్ద విష‌యాల‌కు సంబంధించి కోర్టుకు వెళ్తున్నారా ? అంటే అది లేదు.చిన్నపాటి ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేయ‌క‌పోవ‌డం.. నాడు నేడు ప‌నుల‌కు సంబంధించి నిధులు, ఆఫీస్‌ల‌కు రంగులు.. ఇలా.. చిన్న చిన్న విష‌యాల్లో అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రించ‌ని కార‌ణంగా.. కోర్టు ఆగ్రహానికి గురై.. వ్యక్తిగతంగా అధికారులు ఇబ్బంది ప‌డుతూ.. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు కూడా ఇబ్బందులు తెస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ప‌రిస్థితి మారాలంటే.. జ‌గ‌నే స్వయంగా దృష్టి పెట్టాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Except for the court hamstrings …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page