గుడివాడ డివిజన్లో 1,147 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు మంత్రి కొడాలి నాని

0 13

గుడివాడముచ్చట్లు:

 

 

గుడివాడ డివిజన్ లో బుధవారం ఒక్కరోజే 1,147 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పరీక్షలు నిర్వహించిన వారిలో 23 మందికి కోవిడ్ -19 వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయిందని తెలిపారు. గుడివాడ రూరల్ మండలంలో 69 మందికి, నందివాడ మండలంలో 115 మందికి, గుడ్లవల్లేరు మండలంలో 62 మందికి, కైకలూరు మండలంలో 192 మందికి, పామర్రు మండలంలో 232 మందికి, గుడివాడ పట్టణంలో 104 మందికి, కలిదిండి మండలంలో 115 మందికి, మండవల్లి మండలంలో ఒకరికి, ముదినేపల్లి మండలంలో 113 మందికి, పెదపారుపూడి మండలంలో 144 మందికి కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించామన్నారు. కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, పెదపారుపూడి మండలాల్లో ఎటువంటి కరోనా కేసులు నమోదు కాలేదని చెప్పారు. డివిజన్లో కరోనా పాజిటివిటీ 2.01 శాతంగా నమోదైందని మంత్రి కొడాలి నాని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags:Corona diagnostic tests for 1,147 people in Gudivada division
Minister Kodali Nani

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page