గో వధ నిషేధ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత

0 13

కుక్కునూరు  ముచ్చట్లు:
మండలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూవీర్రాజు  పిలుపు మేరకు గో వధ నిషేధచట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన గోవు భారతీయ జీవన విధానంలో అంతర్భాగమై మాతృదేవత అంతటి స్థానాన్ని పొంది గోమాతగా రూపుదిద్దుకున్నది. భారతీయ పరంపరలో భాగమైన గోమాతను కాపాడవలసిన బాధ్యత భారతీయులందరి మీద ఉన్నది. భారత రాజ్యాంగములో కూడా గోసంరక్షణ గురించి స్పష్టమైన చట్టాలు ఉన్నాయి. గో సంరక్షణ కేవలం ధార్మిక భావనతో మాత్రమే కాక మానవ మనుగడకు మూలాధారమైన వ్యవసాయ నిర్వహణలో, గో ఆధారిత సేద్యం, శాస్త్రీయంగా ఉపయుక్తంగా యున్నది. ఆంధ్రప్రదేశ్ లో  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చిన తరువాత, హిందువుల మనో భావాలు దెబ్బతినే రీతిగా ఇక్కడ పుణ్యక్షేత్రాలను నిర్లక్ష్యం చేస్తూ, గో సంరక్షణను అపహాస్యం చేస్తూ, హిందువుల మనోభావాలను కించపరిచిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ పరిధిలో బక్రీదు పండుగ సందర్భముగా అక్రమంగా గోమాతలను కభేశాలకు తరలిస్తున్న సమయంలో, స్థానిక కార్యకర్తలు అడ్డుకొని తగుచర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని అభ్యర్ధించడం జరిగింది. పోలీస్ శాఖ నుండి ఎటువంటి స్పందన లేదు. ఆ సందర్భముగా స్థానిక ముస్లిం ముష్కరులు అక్కడికి వచ్చి పోలీస్ వారి సమక్షములోనే కార్యకర్తలను తీవ్రముగా కొట్టడం, వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడముచే స్థానిక ఆసుపత్రికి తరలించడం. జరిగింది. ఈ సంఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడాన్ని బిజెపి ఖండిస్తున్నది. బాధిత కార్యకర్తలలో దళిత సోదరుడు ఉన్నపటికి కూడా, వారి రక్షణార్ధము ఉన్నటువంటి ఎస్సి,ఎస్టీ చట్టాలను కూడా పరిగణలోనికి తీసుకోక వారికి న్యాయం చేకూర్చలేదు. సంఘటన జరిగి వారంరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పోలీస్ వారు దాడి చేసిన దుండగులపై ఎటువంటి చర్యలు చేపట్టక పోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తున్నదా అని సందేహం కలుగుతున్నది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఒక స్పష్టమైన హిందూ వ్యతిరేక ఆజెండాతో పాలన సాగిస్తున్నట్లు స్పష్టమౌతోంది. అధికార పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి, ముస్లిం సంతుష్టికరణ విధానాన్ని ప్రోత్సహిస్తూ వారి సమక్షంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ దేశంలోని కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. గోసంరక్షణ చట్టాలు ఇప్పుడు అవసరంలేదని, వెంటనే ఎత్తివేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయడం తోపాటుగా సెక్యులరిజం ముసుగులో గోసంరక్షణ చట్టాలను అవహేళన చేస్తూ ముస్లిం విధానాన్ని ప్రోత్సహిస్తూ మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయవలసినదిగా బిజెపి తరుపున డిమాండ్ చేస్తున్నామని, కార్యకర్తలపై హత్య ప్రయత్నం చేసిన ముస్లిం గుండాలను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని దళిత కార్యకర్తలకు ఎస్సి అట్రాసిటీ చట్టాల కింద తగిన న్యాయం చేయాలని, అనుచిత వ్యాఖ్యలు చేసి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన  చేయడంతో తోపాటుగా
గో వధ నిషేధ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడిన అధికార పార్టీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కుక్కునూరు మండల  తహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలమహిళామోర్చాఅధ్యక్షురాలు రాచమడుగు వరలక్ష్మీ,  నిరంజన్, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు కుంజా వెంకటనర్సయ్య  తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Submission of petition to the Tehsildar to take action against the MLA who spoke against the Go Killing Prohibition Act

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page