చౌడేపల్లెలో జగనన్న పచ్చతోరణం ను విజయవంతం చేయాలి

0 47

చౌడేపల్లె ముచ్చట్లు:

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంతా చేపడుతున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు సూచించారు. బుధవారం రాజమండ్రి నర్సరీ నుంచి చౌడేపల్లెకు చేరిన వెహోక్కలను ఎంపీడీఓ శంకరయ్య, ఏపిఓ శ్రీనివాస యాదవ్‌తో కలిసి పరిశీలించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మండలానికి 25 వేలు వెహోక్కలు కేటాయించారని వీటిని ఒకే రోజు అన్ని గ్రామాల్లో గల రహదారుల్లో వెహోక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. పంచాయతీ వారీగా కేటయించిన మేరకు వెహోక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.వారి వెంట జేఈ వెంకటముని, టిఏలు మధన్‌మోహన్‌, అలీషా తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

Tags: Jagannath greenery in Choudepalle should be successful

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page