పార్టీకి, పదవులకు గుర్తింపు తీసుకొస్తాం- చైర్మన్లు నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌

0 82

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వైఎస్‌ఆర్‌సిపికి , కేటాయించిన పదవులకు గుర్తింపు వచ్చేలా పనిచేస్తామని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా అథారిటి చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌లు తెలిపారు. బుధవారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, వివిధశాఖల ఉద్యోగులు నూతన చైర్మన్ల దంపతులకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సిపి విధివిధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ మంత్రి ఆధ్వర్యంలో ముడా ద్వారా ఎంఐజి, ఎల్‌ఐజి ప్లాట్లను అన్ని ప్రాంతాల్లోను ఏర్పాటు చేసి, సరసరమైన ధరలకు విక్రయించి, జగనన్నటౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో తహశీల్ధార్‌ వెంట్రాయులు, సీఐ గంగిరెడ్డి, మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రెడ్డికార్తీక్‌, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, పార్టీ నాయకులు అమరేంద్ర, అమ్ము, మనోహర్‌, చంద్రారెడ్డి యాదవ్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: We will bring recognition to the party and positions – Chairmen Nagbhushanam, Venkatereddy Yadav

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page