పుంగనూరులో ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం

0 31

పుంగనూరు ముచ్చట్లు:

- Advertisement -

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా స్థానిక లయన్స్ అపోలో డయాలసిస్ సెంటర్ నందు డాక్టర్ జెరూసిన్.హెపటైటిస్-బి వ్యాధి గురించి డయాలసిస్ రోగులకు మరియు ప్రజలకు అవగాహన కలిగించారు. హెపటైటిస్ బి లో ఉన్న రకాలు వాటివల్ల కలిగే ఎటువంటి పరిణామాల గురించి సవివరంగా అవగాహన కల్పించారు.హెపటైటిస్ బి సంక్రమించే విధానం గురించి తెలియజేస్తూ ఈ వ్యాధి వల్ల లివర్ సంబంధించిన జబ్బులు వస్తాయని లివర్ క్యాన్సర్కు కూడా అవకాశం ఉందని తెలియజేశారు. ఇది అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధి అని రక్తమార్పిడి
సూదులు ఒకరు వాడినవి మరొకరు వాడటం వల్లహెపటైటిస్ వ్యక్తుల లాలాజలం వల్ల వారితో సంభోగం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది అని తెలియజేశారు.వ్యాక్సిన్ వల్ల ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలియజేశారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: World Hepatitis Day in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page