బిసి రిజర్వేషన్ల అమలులో అనేక రకాలుగా అక్రమాలు

0 9

– బీసీ కమిషన్ జోక్యం చేసుకోవాలని బిసి సంఘాల విజ్ఞప్తి

 

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

 

- Advertisement -

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డు – రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నియామకాలలో బిసి రిజర్వేషన్ల అమలులో అనేక రకాలుగా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి జాతీయ బీసీ కమిషన్ జోక్యం చేసుకొని, తగు ఆదేశాలు జారీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నేడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ సహాని  తో కలిసి చర్చలు జరిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన బీసీ నాయకులు కమిషన్ చైర్మన్ తో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చలలో బి.సి నేతలు గుజ్జ కృష్ణ, లాకా వెంగల్ రావు, లాల్ కృష్ణ,   నీల వెంకటేష్, నుకనమ్మ,  R.చంద్రశేఖర్ గౌడ్,  నికిల్, మద్విరాజ్, నాగేశ్వర్ రావు, బోను దుర్గా నరేష్, బర్క కృష్ణ, పగిల్ల సతీష్,  అనంతయ్య, నంద గోపాల్, చంటి ముదిరాజ్, కే.నర్సింహ గౌడ్, ఉదయ్, బబ్లు గౌడ్, బైరు నరేష్ గౌడ్, మణికoట గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కవ మార్కులు వచ్చిన, మెరిట్ లో వచ్చిన బిసి అభ్యర్థులను ఓపెన్ కాంపిటీషన్ కోట లో భర్తీ చేయాలి. కానీ వీరిని బిసి రిజర్వేషన్ కోటాలో భర్తీ చేస్తూ ఈ వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రిక్రూట్మెంట్ సంస్థలన్నీ ఇదేవిధమైన తప్పుడు విధానాలు అవలంబిస్తూన్నాయని, దీనిని అరికట్టడానికి వెంటనే కమిషన్ జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags: Irregularities in the implementation of BC reservations in many ways

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page