బ‌స‌వ‌రాజు బొమ్మైకి ప్ర‌ధాని మోదీ అభినంద‌న‌లు యెడియూరప్ప‌పై ప్ర‌ధాని  ప్ర‌శంస‌ల వ‌ర్షం

0 22

బెంగ‌ళూరు ముచ్చట్లు:
క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన బ‌స‌వ‌రాజు బొమ్మైకి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. చ‌ట్ట‌స‌భ‌ల‌కు సంబంధించి, ప‌రిపాల‌న‌కు సంబంధించి బ‌స‌వ‌రాజు బొమ్మైకి అపార అనుభ‌వం ఉన్న‌ద‌ని, ఆ అనుభ‌వం క‌ర్ణాట‌క భ‌విష్య‌త్ పురోగ‌తికి ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ఇప్ప‌టికే బీజేపీ స‌ర్కారు ద్వారా క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన అసాధార‌ణ‌ అభివృద్ధిని బ‌స‌వ‌రాజు బొమ్మై మ‌రింత ఇనుమ‌డింప‌జేస్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉన్న‌ద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూరప్ప‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. భారతీయ జ‌న‌తాపార్టీ ఎదుగుద‌ల‌కు, క‌ర్ణాట‌క రాష్ట్ర అభివృద్ధికి యెడియూర‌ప్ప చేసిన విశేష సేవ‌లు ఎప్ప‌టికీ మ‌రువ‌లేనివ‌ని ఆయ‌న కొనియాడారు. గత కొన్ని ద‌శాబ్దాలుగా యెడియూర‌ప్ప క‌ర్ణాట‌క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నార‌ని, రాష్ట్రం మూల‌మూల‌లా తిరిగి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై అన్ని ప్రాంతాల అభివృద్ధికి క‌ఠోర శ్ర‌మ చేశార‌ని ప్ర‌శంసించారు. సామాజిక సంక్షేమం విష‌యంలో యెడియూర‌ప్ప‌కు ఉన్న క‌మిట్‌మెంట్‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేమ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

 

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

- Advertisement -

Tags:Prime Minister Modi congratulates Basava Raju Bommai
The Prime Minister showers praise on Yeddyurappa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page