భరోసా సెంటర్ కు శంకుస్థాపన

0 14

హైదరాబాద్  ముచ్చట్లు:
సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్ లో  భరోసా సెంటర్  శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.  రాష్ట్ర  హోం మినిస్టర్ మహమూద్ అలీ భరోసా సెంటర్ కు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గోన్నారు.
హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.  ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో చాలా మంది మహిళలు పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. వారి సమస్య ల పరిష్యారం కోసం భరోసా సెంటర్స్ పని   చేస్తాయి. పోలీసులు బాగా పని చేస్తున్నారు. సిటీలో లాండ్ అండ్ ఆర్డర్  కంట్రోల్ లో ఉందని అన్నారు. సిటీ లో 60 శాతం సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల పర్యవేక్షణ తో  క్రైమ్  కంట్రోల్ లో ఉంది. లాక్ డౌన్ తో పొలిసులు కరోనా ను కంట్రోల్ చేశారు కరోనా సమయంలో పోలీసులు బాగా పని చేశారని అన్నారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాల కోసం ఈ భరోసా సెంటర్ కు శంకుస్థాపన చేశాం.  భరోసా సెంటర్స్ తో ప్రజలకు మరింత భద్రత పెరుగుతుంది. మహిళ భద్రత మన అందరి బాధ్యత. మహిళ భద్రత కోసం షీ టీమ్స్,భరోసా సెంటర్స్ పని చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల  సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్ట్ తో క్రైమ్ కంట్రోల్  చేస్తున్నాం. ప్రజలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ భరోసా సెంటర్స్ తో బాధిత మహిళలకు,యువతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కోటి 75 లక్షల తో ఈ భరోసా సెటర్ ను నిర్మిస్తున్నాం. మహిళల సేఫ్టీ సెక్యూరిటీ లో భరోసా సెంటర్స్ కీలకంగా పని చేస్తున్నాయని అన్నారు.

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

 

- Advertisement -

Tags:Concreting to Assurance Center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page