మరోసారి పార్టీ మార్పు తప్పదా

0 19

విశాఖపట్టణం ముచ్చట్లు :
సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? టీడీపీలోనే ఉంటారా? మరో పార్టీకి జంప్ అవుతారా? అన్నది ఇప్పుడు విశాఖ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం యాక్టివ్ గా లేరు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆయన అనుచరులంతా వైసీపీలోకి జంప్ అయ్యారు.ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు అడుగులు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి రావాలనుకున్నా కొన్ని ఇబ్బందులున్నాయి. మిగిలిన వారిలా వైసీపీకి మద్దతిచ్చి ఎమ్మెల్యేగా ఉండదలచుకోలేదు. అందుకే తెలివిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం పొందకపోయినా గంటా శ్రీనివాసరావుకు మాత్రం మైలేజీని తెచ్చిపెట్టింది.ఉప ఎన్నిక జరిగినా తాను పోటీ చేయనని ఆయన స్పష్టం చేశారు. అంటే వచ్చే ఎన్నికల వరకూ తాను రాజకీయాలను పట్టించుకోనని చెప్పకనే చెప్పేశారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్ గా లేరు. ఆయన లోకేష్ నాయకత్వాన్ని తొలి నుంచి అంగీకరించడం లేదు. అయ్యన్న పాత్రుడికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా అధికారంలో ఉన్నప్పటి నుంచి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.ఇక భీమిలీ సీటు కూడా వచ్చే ఎన్నికల్లో తనకు టీడీపీ ఇవ్వదని తేలిపోయింది. దీంతో గంటా శ్రీనివాసరావు మరోసారి పార్టీ మారక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలోకి వెళ్లినా ఎంపీ టిక్కెట్ తప్ప ఎమ్మెల్యేకు నో ఛాన్స్ అంటున్నారట. అందుకే గంటా శ్రీనివాసరావు ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలిసింది. జనసేనలోకి జంప్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అధికారంలోకి రాకపోయినా కేంద్రంలో బీజేపీ పవర్ లో ఉంటుందన్న నమ్మకంతోనే గంటా శ్రీనివాసరావు అటువైపు చూస్తున్నారన్న టాక్ స్టీల్ సిటీలో వినిపిస్తుంది.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Do not change the party once again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page