మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

0 22

కృష్ణా ముచ్చట్లు :

 

కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగు జగనన్న కాలనీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ ప్రభుత్వం పేదలకు గడ్డమణుగులో ఇళ్ళ స్థలాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా అక్కడ మెరకను చదును చేసే పనులు కొనసాగిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన దేవినేని ఉమా అటవీ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ అసత్యపు ప్రచారం సాగించారు. 50 మందికి పైగా తన అనుచరులతో ఇళ్ల స్థలాల వద్దకు చేరుకున్న ఉమా.. నియోజకవర్గ ఎమ్మెల్యేపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి ఉమాని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఉమా తనపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ అసత్యపు ఆరోపణలు చేస్తూ కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు దీంతో ఉమను అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; Former minister Devineni Uma arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page