మేడ్చల్‌ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

0 9

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

మేడ్చల్‌ జిల్లాలోని పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జీడిమెట్లలోని నాసెన్స్‌ రసాయన పరిశ్రమలో నుంచి మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్నాయి. కాగా, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో.. పోలీసులు, ఫైర్‌సెఫ్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా, క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను నాలుగు ఫైరింజన్‌ల సహయంతో అదుపులోనికి తేవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఆకాశంలో నల్లని పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటనకు బాయిలర్‌ పేలుడే కారణమని స్థానికులు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; Massive fire hazard in the medical chemical industry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page