యువకుడి కిడ్నాప్.. హత్య

0 27

నల్లజర్ల  ముచ్చట్లు:

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం సమీపంలో యువకుడి కిడ్నాప్, హత్య కలకలం రేపుతోంది. కలకత్తాలో ఎన్ ఐటీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కొయ్యల వంశీ (24) అనే యువకుడుని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో దుండగులు కిడ్నాప్ చేసి.. కాసేపటికే హత్య చేశారు. చికెన్ వ్యాపారం చేసే తండ్రి శ్రీనుకి ఫోన్ చేసి 25 లక్షలు డిమాండ్ చేయగా, పోలీసులను ఆశ్రయించిన తండ్రి శ్రీను.. తన దగ్గర ఉన్న లక్ష రూపాయల నగదు తో కిడ్నాపర్లు చెప్పిన నల్లజర్ల గ్రామ శివారుకు చేరుకున్న తండ్రికి కిడ్నాపర్లు కనిపించకపోవడంతో తెల్లవార్లు అక్కడే ఉండి, ఇంటికి వచ్చి చూసేసరికి ఊరి చివర షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో విగతజీవిగా కనిపించాడు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకొని పంచనామా నిర్వహించి, కేసు దర్యాప్తు చేసి తొందర్లోనే కిడ్నాపర్లను పట్టుకుంటామని తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:Young man kidnapped .. murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page