యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం… 18 మంది దుర్మరణం

0 13

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు :

 

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక వాల్వో బస్సును వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన బారాబంకీ పరిధిలోని రామ్‌సనేహీఘాట్ వద్ద చోటుచేసుకుంది. బస్సు హరియాణాలోని పల్వల్ నుంచి బీహార్ వెళుతోంది. బస్సులో కూలీలు ఉన్నారు. వందమంది ప్రయాణికులు ఉన్న ఈ బస్సులో 18 మంది మృతి చెందారు. బస్సు మరమ్మతుకు గురవడంతో, రామ్ సనేహీఘాట్ వద్ద నిలిపివుంచారు. ఇంతలో ఒక ట్రక్కు బలంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది.

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags; Terrible road accident in UP … 18 killed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page