రైతులందరూ పంట నమోదు చేయించుకోవాలి

0 10

వ్యవసాయ అధికారి శివశంకర్
మంత్రాలయం  ముచ్చట్లు:

రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి శివ శంకర్ రైతులకు తెలియజేశారు. బుధవారం చెట్నిహల్లి మరియు మాధవరం గ్రామాల్లో పంట నమోదుపై వ్యవసాయ అధికారులు పంట పొలాల్లో  పర్యవేక్షించారు. మంత్రాలయం మండలంలోని రైతులందరు మీ రైతు భరోసా కేంద్రాలలో పంట నమోదుకు రిజిస్ట్రేషన్ చేసిన తరువాత మీ పంట పొలాలకు వచ్చు పంట నమోదు చేస్తారు. ఇలా ప్రతి రైతు పంట నమోదు చేసుకుంటే ప్రభుత్వము నుండి రావలసిన అన్ని పథకాలకు అర్హులు.. ఇలా పంట నమోదు చేయించకోవాలని తెలిపారు.చెట్నిహళ్ళి మరియు మాధవరం గ్రామంలోని  రైతులతో మాట్లాడుతూ  మండలంలో రైతులు పంట వేసిన తరువాత  కచ్చితము గా పంట  నమోదు చేయించుకోవాలి. పంట  నమోదు చేయించుకోని ఎడల  ఇన్సూరెన్స్, పంటల భీమ, కనీస మద్దతు ధర వర్తించవు. కావున మండల పరిధిలోని రైతులు తమ గ్రామాల్లో ఉన్న రైతు భరోస కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులతో పంట నమోదు చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శివ శంకర్ గారు, ఏఇఒ నరసింహులు, వీఎఎలు సువర్ణ, మదుకర్, వీహచ్ఏ ప్రవీణ మరియు రైతులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ నూతన కార్యవర్గం పదవిస్వీకారం

Tags:All farmers are required to register for the crop

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page